: రాష్ట్రాన్ని విభజించాం...ఓట్లడిగే హక్కు మాకే ఉంది: చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లడిగే హక్కు తమకే ఉందని కేంద్ర మంత్రి చిరంజీవి తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు మంచే జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులు, మహిళలు, పేదల గుండెల్లో ఉందని ఆయన చెప్పారు. భారతీయులమని చెప్పుకునేలా దేశాన్ని తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన తెలిపారు.