: బీజేపీకి మెజారిటీ రాదు...హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుంది: సురవరం
కేంద్రంలో హంగ్ పార్లమెంట్ ఏర్పడుతుందని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి మెజారిటీ రాదని అన్నారు. బీజేపీకి ఓటేస్తే మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యడ్యూరప్ప, చంద్రబాబు నాయుడుల ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన పిలుపునిచ్చారు.