: ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటి జరైన్ ఖాన్
బాలీవుడ్ నటి జరైన్ ఖాన్ ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరింది. తాజాగా ఈ భామ పంజాబీలో 'ఝాట్ జేమ్స్ బాండ్' అనే చిత్రంలో నటించింది. అక్కడ దాని ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం భోజనం చేసిన జరైన్ వెంటనే ముంబయి వచ్చింది. అప్పుడే చాలా ఇబ్బందిగా అనిపించడంతో ఆసుపత్రిలో చేరింది. ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరైన్ అస్వస్థతకు గురైందని సమాచారం. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.