: పాఠ్య పుస్తకాల్లో వాజ్ పేయి, మోడీ జీవితాలు!


మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి, ప్రస్తుత బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ దేశ రాజకీయాల్లో గుర్తుంచుకోదగిన వ్యక్తులు. పాఠశాల స్థాయి నుంచే వారి గురించి పిల్లలకు తెలిసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. ఈ మేరకు త్వరలో సెకండరీ స్కూల్ లెవల్ (ఉన్నత పాఠశాల స్థాయి) పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని నిర్ణయించుకున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కాళీ చరణ్ సరాఫ్ తెలిపారు. ఈ మేరకు మోడీ ప్రధానమంత్రి కాగానే ఆయన జీవితం, పోరాటాలపై ఓ అధ్యాయాన్ని పరిచయం చేయనున్నట్లు చెప్పారు. ఇక మాజీ ప్రధాని వాజ్ పేయి గురించి కూడా సిలబస్ లో చేర్చనున్నట్లు సరాఫ్ వెల్లడించారు. ఇంతవరకు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గురించి మాత్రమే సిలబస్ లో చేర్చారని, వాజ్ పేయి కాంగ్రెస్ కు చెందిన వ్యక్తి కాకపోవడంవల్లే ఆయనను చేర్చలేదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News