: నా వ్యక్తిగత విషయాలపై స్పందించను: దిగ్విజయ్ సింగ్


అందరి వ్యక్తిగత జీవితాలపై స్పందించే దిగ్విజయ్ సింగ్ తమ ప్రేమాయణంపై స్పందించేందుకు నిరాకరించారు. విజయవాడలో కాంగ్రెస్ విజయం కోసం పర్యటించిన ఆయన మాట్లాడుతూ, పురందేశ్వరిని కాంగ్రెస్ పార్టీ పదవులిచ్చి గౌరవించిందని అన్నారు. అలాగే పీవీకి కూడా న్యాయం చేశామని, అయన అంత్యక్రియలకు స్థలం కేటాయిస్తామన్నా, ఆయన కుటుంబసభ్యులే పార్థివ దేహాన్ని తీసుకెళ్లారని తెలిపారు. నరేంద్ర మోడీకి లౌకికవాదం అంటే అర్థం కూడా తెలియదని, ఆర్ఎస్ఎస్ భావజాలం మెండుగా ఉన్న వ్యక్తి మోడీ అని డిగ్గీరాజా మండిపడ్డారు. సోషల్ మీడియాలో బీజేపీ విషప్రచారం చేస్తోందని డిగ్గీరాజా అన్నారు.

  • Loading...

More Telugu News