: గుజరాత్ స్నూప్ గేట్ వివాదంపై విచారణ చేపడతాం: షిండే
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ముందే గుజరాత్ స్నూప్ గేట్ వివాదంపై న్యాయమూర్తితో విచారణ చేపడతామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 2009లో ఓ మహిళపై అక్రమంగా నిఘా పెట్టడానికి సంబంధించి, మోడీ ముఖ్య అనుచరుడు అప్పటి హోం మంత్రి అమిత్ షా, ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల మధ్య జరిగిన సంభాషణలు టీవీ ఛానెళ్లలో ప్రసారం కావడంతో ఈ స్నూప్ గేట్ వ్యవహారం బయటపడింది. దీని వెనుక మోడీ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు కూడా వచ్చాయి.