: జూన్ 2 నుంచి వ్యాపారులకు కొత్త టిన్ నెంబరు: సమారియా
జూన్ 2 నుంచి ఆంధ్రా, తెలంగాణ వ్యాపారులకు వేర్వేరుగా కొత్త టిన్ నెంబర్లను కేటాయించనున్నట్టు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా తెలిపారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల వాణిజ్య సంస్థల డీలర్లు, వ్యాపారులతో ఆయన సమావేశమయ్యారు. జూన్ 2 నుంచి తెలంగాణకు టిన్ నెంబర్ 36, ఆంధ్రప్రదేశ్ కు టిన్ నంబర్ 37 కేటాయించామని ఆయన వెల్లడించారు.