: జగన్ ఓ అవినీతిపరుడు... ఎన్నటికీ సీఎం కాలేడు: వీహెచ్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మరోసారి మండిపడ్డారు. అత్యంత అవినీతిపరుడైన జగన్ ముఖ్యమంత్రి కావాలనుకోవడం హాస్యాస్పదమని... జగన్ ఎన్నటికీ సీఎం కాలేడని జోస్యం చెప్పారు. అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని... బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు. తాను ఎవరిపైనా దాడి చేయనప్పటికీ... తనపై తప్పుడు కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.