: వైఎస్ పేరు చెప్పుకుని వైసీపీ నేతలు ఓట్లు అడుగుతున్నారు: జైరాం రమేష్
దివంగత వైఎస్ పేరు చెప్పుకుని వైఎస్సార్సీపీ ఓట్లు అడగటంపై కేంద్ర మంత్రి జైరాం రమేష్ మండిపడ్డారు. వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ కాంగ్రెస్ పథకాలేనని చెప్పారు. అవసరమైతే వైసీపీ బీజేపీతో కూడా చేరుతుందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో జైరాం మాట్లాడారు. వైఎస్ ఆత్మ క్షోభించే విధంగా జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.