: నాయకత్వ లోపం ఉంది... అయినా ప్రభుత్వం ఏర్పాటుచేస్తాం: గండ్ర
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీనే ఇచ్చిందన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంతవరకు విఫలమయ్యామని చెప్పారు. దీనికి కారణం రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడమేనని తెలిపారు. ఏదేమైనప్పటికీ, అనుకున్నన్ని స్థానాలను సొంతం చేసుకోలేకపోయినా... అధికారంలోకి రావడం మాత్రం ఖాయమని చెప్పారు. ఈ రోజు వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.