: చావు అంచుల్లో సైతం ఉల్లాసంగా గడిపిన విద్యార్థులు


టీనేజ్... తుళ్లిపడే వయసు. దుఃఖం, ఆందోళన మనసుకుపట్టవు. ఉండేదంతా ఆనందమే! గత నెలలో దక్షిణ కొరియాలో విహార యాత్రకు బయల్దేరిన నౌక మునిగిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఆ చివరిక్షణాల్లో కూడా యువత ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. తాజాగా పార్క్ సుహెయిన్ అనే విద్యార్థి మృతదేహం లభ్యమైంది. తన చివరి క్షణాలను సుహెయిన్ తన సెల్ ఫోన్ లో నిక్షిప్తం చేశాడు.

అందులో ఇంకాసేపట్లో పడవ మునిగిపోతుందనగా అందులోని విద్యార్థులు తమకు ఏమీ కాదనుకున్నారో ఏమో కానీ... టైటానిక్ లాగా ఈ నౌక కూడా మునిగిపోతుందని ఓ విద్యార్థి అంటే, ఆ వార్త మీడియాలో హల్ చల్ చేస్తుందంటూ మరో విద్యార్థి జోక్ వేశాడు. దీంతో సహవిద్యార్థులంతా ఘొల్లున నవ్వారు. కొంత సేపటికే వారంతా మృత్యు కౌగిలిలోకి జారిపోయారు. ఈ వీడియోలు బయటికి విడుదల చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులంతా దుఃఖసాగరంలో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News