: చెన్నై పేలుళ్లపై విచారణ ప్రారంభం
చెన్నై పేలుళ్లపై రైల్వే రక్షణ విభాగం విచారణ ప్రారంభించింది. రైల్వే రక్షణ విభాగం కమిషనర్ విఠల్ నేతృత్వంలో అధికారులు సాక్షులను విచారిస్తున్నారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న జంట పేలుళ్లలో ఒకరు మృతి చెందగా, 14 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.