: ఎన్డీయేకు 317 సీట్లు ఖాయం.. జోరందుకున్న బెట్టింగ్
మరో రెండు దశల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఎన్డీయే సాధించే లోక్ సభ స్థానాల విషయంలో బుకీల బెట్టింగ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎన్డీయేకు 317 లోక్ సభ స్థానాలు వస్తాయని తాజాగా ముంబైలో బెట్టింగ్ నడుస్తోంది. ప్రధాని ఎవరవుతారన్న విషయంలో మోడీపై 48 పైసలు, రాహుల్ పై 60 పైసలు, ములాయంపై రూ. 5.50, అరవింద్ కేజ్రీవాల్ పై రూ.11.50 బెట్టింగ్ నడుస్తున్నట్లు ఓ బుకీ వెల్లడించాడు. అంటే ప్రతీ రూపాయి పందేనికి వారు చెప్పిన వారు గెలిస్తే బుకీలు అదనంగా ఈ మేర చెల్లిస్తారన్నమాట.