: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కేంద్రం, సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం


బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కేంద్ర ప్రభుత్వం, సీబీఐపై సుప్రీంకోర్టు ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, ఇతరులపై ఫిర్యాదు దాఖలు చేయడానికి ఎందుకు జాప్యం చేశారంటూ కేంద్రం, సీబీఐని ప్రశ్నించింది. గతంలో ఈ కేసులో అద్వానీ, ఇతరులపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. కానీ, సీబీఐ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన జస్టిస్ హెచ్ ఎల్ దత్తు ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్.. రెండు వారాల్లోగా వివరాలతో కూడిన అఫిడవిట్ ను న్యాయస్థానంలో దాఖలు చేయాలని ప్రభుత్వ సీనియర్ ఉద్యోగిని ఆదేశించింది.

  • Loading...

More Telugu News