: తొగాడియాపై నాందేడ్ లో కేసు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసారనే ఆరోపణలపై విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియాపై మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా పోలీసులు ఈ రోజు కేసు నమోదు చేసారు. సెక్షన్ 505, 153ఎ కింద కేసు నమోదైంది. తొగాడియా వ్యాఖ్యలపై ఆల్ ఇండియా డెమొక్రటిక్ నేత ఇమ్రాన్ అలీ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు.