: రెండో రోజు సీబీఐ ముందుకు పీసీ పరేఖ్


బొగ్గు కుంభకోణం కేసులో కోల్ శాఖ మాజీ సెక్రటరీ పీసీ పరేఖ్ రెండో రోజు సీబీఐ ముందు హాజరయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి ఆయన వచ్చారు. నిన్న ఎనిమిదిగంటల పాటు పరేఖ్ ను అధికారులు ప్రశ్నించారు. కోల్ శాఖకు సెక్రటరీగా ఉన్న సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి హిందాల్కో కంపెనీకి బొగ్గు క్షేత్రాలు కేటాయించారంటూ ఆరోపణలు రావడంతో పరేఖ్ పై ఛార్జిషీటు కూడా దాఖలైంది.

  • Loading...

More Telugu News