: నేటి నుంచి స్వదేశంలో ఐపీఎల్ పోరు


ఐపీఎల్-7లో పార్ట్ వన్ ముగిసింది. నేటి నుంచి పార్ట్ టూ మొదలవుతోంది. యూఏఈ వేదికగా 15 రోజులపాటు జరిగిన ఐపీఎల్ అక్కడ పోరు ముగించుకుని... ఇప్పుడు స్వదేశానికి వచ్చింది. నేటి నుంచి ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లన్నీ ఇండియాలోనే జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, ఐపీఎల్ కు సెక్యూరిటీ కల్పించలేమని భారత హోం శాఖ స్పష్టం చేయడంతో టోర్నీ వాయిదా పడకుండా చూసేందుకు ప్రారంభ మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించారు. ప్రస్తుతం ఎన్నికల పోరు తుది దశకు చేరుకోవడంతో, ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన వేదికల్లో మిగిలిన మ్యాచ్ లను నిర్వహిస్తారు. ఎన్నికలు పూర్తయ్యాక దేశ వ్యాప్తంగా మ్యాచ్ లు జరుగుతాయి.

  • Loading...

More Telugu News