: తన ఈ-మెయిల్ హ్యాక్ అయిందంటూ డిగ్గీరాజా గాళ్ ఫ్రెండ్ ఫిర్యాదు
టీవీ యాంకర్ అమృతారాయ్ తో కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ కు ఉన్న సంబంధం ఫోటోలతో సహా బయటపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడెక్కడ చూసినా ఆ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. దాంతో, అమృతా ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. తన మెయిల్ ను ఎవరో హ్యాక్ చేసి, దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. తాను, దిగ్విజయ్ కలసి ఉన్న ఫొటోలను ఎవరో దొంగిలించి నెట్ లో పెట్టారని చెప్పింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు కమిషనర్ రవీంద్ర యాదవ్ ధృవీకరించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా సెక్షన్ 66 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు.