: ప్రియాంక తన కూతురని మోడీ అనలేదు: గుజరాత్ సీఎం కార్యాలయం


మోడీ, ప్రియాంకల మధ్య మొదలైన 'తండ్రీ, కూతుళ్ల' వివాదం మరో మలుపు తీసుకుంది. మోడీ దూరదర్శన్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, ప్రియాంకాగాంధీని ఉద్దేశించి తన కూతురు వంటిదని అన్నట్లు వార్తలు రావడం... తాను రాజీవ్ కుమార్తెనని, తన తండ్రి స్థానంలో మరొకరిని ఊహించలేనని ప్రియాంకాగాంధీ బదులివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం దూరదర్శన్ ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని విడుదల చేసింది. ప్రియాంక తన కూతురని మోడీ ఎక్కడా అనలేదని స్పష్టం చేసింది. 'ఏ కూతురైనా తన తల్లి, సోదరుడి గెలుపు కోసం ఏమైనా చేయొచ్చు. అందుకోసం నన్ను ఎన్ని సార్లు తిట్టినా, ఒక కూతురిలా ఆమె ఏం చేసినా ఆమె పట్ల నేనేమీ కోపం తెచ్చుకోను' అని మోడీ అన్నట్లు అందులో ఉందని గుజరాత్ సీఎం కార్యాలయం పేర్కొంది.

  • Loading...

More Telugu News