: అహంభావి, గర్విష్టి అయిన కిరణ్ సీఎం అవడం మన దౌర్భాగ్యం : కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్య మీద స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేక ఒక్కనిమిషం కూడా కరెంట్ అంతరాయం లేకుండా చూస్తామన్నారు. అహంభావి, గర్విష్టి అయిన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. ఎవరు చెప్పినా వినకుండా 20వేల కోట్ల రూపాయల మేర విద్యుత్ భారాన్ని సీఎం ప్రజలపై మోపారని కేసీఆర్ విమర్శించారు.