: వసంత నాగేశ్వరరావు కుమారుడు అరెస్ట్
మాజీ హోం మంత్రి, వైఎస్సార్సీపీ నేత వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణ ప్రసాద్ ను అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2013లో జరిగిన రవి అనే ఉపాధ్యాయుడి హత్య కేసులో కృష్ణ ప్రసాద్ ను నిందితుడిగా భావిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయనను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. గతంలో వసంత నాగేశ్వరరావు టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే.