: ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఖాయం: నరేంద్ర మోడీ


విశాఖపట్నంలో ఎన్డీయే ఆధ్వర్యంలో జరుగుతోన్న ‘భారత్ విజయ్ ర్యాలీ’ బహిరంగసభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ ఎన్నికలను 120 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుగా మోడీ అభివర్ణించారు. ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు జరిగి తీరుతుందని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న తల్లీ కొడుకుల పాలనకు కాలం చెల్లిందని ఆయన అన్నారు. మీ ముందు రెండు మార్గాలున్నాయి... ఒకటి స్కామాంధ్ర, రెండు స్వర్ణాంధ్ర. ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని మోడీ అన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదని మోడీ జోస్యం చెప్పారు. ఢిల్లీలో పటిష్ఠమైన ప్రభుత్వం ఏర్పడాలంటే సీమాంధ్రలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరముందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News