: గెలుపు గుర్రాలకే సీట్లు : చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర నిర్వహిస్తోన్న ఆయన కాకినాడలో పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. కాకినాడ నగర, గ్రామీణ నియోజకవర్గాల కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. సీట్ల ఎంపికలో కార్యకర్తల నుంచి వచ్చే సమాచారం పార్టీ అగ్రనాయత్వానికి ఎంతో ఉపకరిస్తుందని బాబు ఈ సందర్భంగా సూచించారు.