: మధుమేహం మతిమరుపునకు దారితీస్తుందట?
మధుమేహంతో మెదడు ముడుచుకుపోతుందని... దీర్ఘకాలంలో మధుమేహం మతిమరుపునకు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. తాజా పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైంది. మధుమేహంతో బాధపడుతున్న వారిలో ప్రతి పదేళ్లకు మెదడు పరిమాణం తగ్గిపోతుందని పెన్సిల్వేనియా వర్శిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఫాంక్రియాస్ గ్రంథి తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకపోవడాన్నే టైప్-2 మధుమేహంగా వ్యవహరిస్తారు. ఒక్కోసారి శరీర కణాలు ఇన్సులిన్ ను శోషించుకోవడంలో విఫలమవడం కూడా టైప్-2 మధుమేహానికి కారణమవుతోంది. దీంతో దీర్ఘకాలంపాటు ఇన్సులిన్ ను ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. 600 మందిపై తాము పరిశోధన చేసినప్పుడు ఈ విషయాలను కనుగొన్నామని శాస్త్రవేత్త నిక్ బ్రాయన్ వెల్లడించారు.