: ఎకో ఫ్రెండ్లీ రిఫ్రిజిరేటర్ ను రూపొందిస్తోన్న శాస్త్రవేత్తలు


తక్కువ కరెంటుతో పనిచేసే, పర్యావరణానికి మేలు చేకూర్చే కొత్త తరహా శీతలీకరణ యంత్రాన్ని (రిఫ్రిజిరేటర్) రూపొందించే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరుపుతున్నప్పటికీ... ఈ ఆధునిక ఫ్రిడ్జ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేసరికి మరో పదేళ్లు పట్టే అవకాశం ఉందని వర్జీనియా యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనా బృందానికి ఓ భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వం వహిస్తున్నారు.

ఈ రిఫ్రిజిరేటర్ తయారీలో మెటామాగ్నెట్లను ఉపయోగించటం వల్ల రసాయనాలతో పని లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాంతో ఇది వాతావరణంలోకి విడుదల చేసే ఉద్గారాలు చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయని ప్రొ. శివరామ్ తెలిపారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న రిఫ్రిజరేటర్ల నుంచి ఎక్కువ ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. అలాగే విద్యుత్ వినియోగం, మరమ్మత్తుల వ్యయం కూడా అధికమే. ఈ ఇబ్బందులేమీ లేకుండా వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ఈ కొత్త తరహా రిఫ్రిజిరేటర్ ను రూపొందిస్తున్నట్లు శివరాం చెప్పారు.

  • Loading...

More Telugu News