: మెదక్ నుంచి కేసీఆర్ ... మరి రాములమ్మ ఎక్కడ?


వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పక్షాలన్నీ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తులు మొదలెట్టాయి. టీడీపీ ఇప్పటికే నియోజక వర్గాల ఇన్ ఛార్జిలను ప్రకటిస్తూ దూకుడు ప్రదర్శిస్తోండగా, టీఆర్ఎస్ విడతల వారీగా అభ్యర్థులను తెరమీదికి తెచ్చే ప్రయత్నాల్లో తలమునకలై ఉంది. అయితే, టీఆర్ఎస్ కు కంచుకోటగా పరిగణించే మెదక్ లోక్ సభ స్థానం ఈసారి ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి మెదక్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే సిట్టింగ్ ఎంపీ విజయశాంతి అందుకు అంగీకరించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులంటున్నారు. సొంత జిల్లా అయినందున కేసీఆర్ ఇక్కడి నుంచే బరిలో దిగాలని భావిస్తుండగా.. సిట్టింగ్ స్థానాన్ని వదులుకుని రిస్క్ తీసుకోవడమెందుకున్నది రాములమ్మ యోచన అని ఆమె సన్నిహితుల మాట.

వీళ్ళిద్దరి విషయం ఇలా ఉంటే వీరి నడుమ మరో వ్యక్తి అప్పుడే మెదక్ సీటుపై కర్చీఫ్ వేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. తాజాగా పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసిన మాజీ ఐఏఎస్ కేవీ రమణాచారి కూడా మెదక్ సీటే కావాలంటున్నాడట. ఏమైనా, మెదక్ విషయంలో టీఆర్ఎస్ కు తలనొప్పి తప్పేట్టు లేదు. 

  • Loading...

More Telugu News