: జంటనగరవాసులకు ఉపశమనం
జంటనగరాల్లో కేబుల్ టీవీ వీక్షకులు సెట్ టాప్ బాక్స్ లేకున్నాగాని రెండు వారాలపాటు టీవీ ప్రసారాలు చూడొచ్చని హైకోర్టు వెసులుబాటు కల్పించిన వేళ, వాతావరణం కూడా ఆహ్లాదంగా మారిపోయి నగరవాసులకు ఉపశమనం కలిగిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం నుంచీ రాజధాని హైదరాబాద్ లో ఈదురుగాలులతో వర్షపు జల్లులు పడుతున్నాయి. కొన్నిప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కూడా కురిసింది. ఎండలు మండి పోయి అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరైపోయిన నగర వాసులు ఈ అకాల వర్షాన్ని ఆస్వాదిస్తూ సేదతీరుతున్నారు.