: ఫ్లోరిడా జైల్లో గ్యాస్ పేలుడు... ఇద్దరు ఖైదీల మృతి


ఫ్లోరిడాలోని ఎస్కాంబియా కౌంటీ జైల్లో ఒక్కసారిగా గ్యాస్ పేలడంతో ఇద్దరు ఖైదీలు మృతి చెందారు. దాదాపు రెండొందల మంది గాయాలపాలైనట్లు సమాచారం. వారిలో ఖైదీలతో పాటు జైలు అధికారులు కూడా ఉన్నారు. ఈ పేలుడు ధాటికి జైల్లోని కొంతభాగం కూలిపోయింది. క్షతగాత్రులందరికీ దగ్గరి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తుండగా, మిగిలిన వారిని పక్క దేశాల జైళ్లకు తరలించినట్లు మహిళా అధికార ప్రతినిధి కాథ్లీన్ కాస్ట్రో వెల్లడించారు. నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News