: ఓదార్పు యాత్రలు తప్ప జగన్ ఇంకేమీ చేయలేరా?: పవన్ కల్యాణ్


ఓదార్పు యాత్రలు తప్ప జగన్ ఇంకేమీ చేయలేరా? అని సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కేసీఆర్ సీమాంధ్ర ప్రజలను బూతులు తిడుతున్నా జగన్ నోరెత్తలేదని పవన్ ఆరోపించారు. కేసీఆర్, జగన్ ల మధ్య అన్నదమ్ముల అనుబంధముందని ఆయన పేర్కొన్నారు. ఇవాళ గుంటూరులో జరిగిన ఎన్డీయే విజయశంఖారావం బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను గుంటూరు జిల్లాలోని బాపట్లలో పుట్టానని, మంచి మనసున్న మనిషిగా ఎదిగానని పవన్ కల్యాణ్ చెప్పారు. తనకు కులమతాలు తెలియవని, భారతీయతే తన మతమని పవన్ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా విభజన విధానంతో ఆవేదన చెంది ప్రజలకు న్యాయం చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని, నరేంద్ర మోడీ విధానాలు నచ్చి, జనసేన పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News