: కోహ్లీతో డేటింగ్ చేస్తున్నానన్న బ్రెజిలియన్ మోడల్!


బాలీవుడ్ నటి అనుష్క శర్మ, యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేమాయణం గురించి అందిరికీ తెలిసిందే. అయితే, తాను దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కోహ్లీతో డేటింగ్ చేస్తున్నానని బ్రెజిలియన్ మోడల్ లజ్బెల్లీ లియెట్ తాజాగా ప్రకటించింది. తాను రెండేళ్లుగా విరాట్ ప్రేమలో ఉన్నానని చెప్పింది. అయితే, గతంలో కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ తో రిలేషన్ ఉన్నా ఒప్పుకోని ఈ భామ ఇప్పుడిలా వెల్లడించడం విశేషం. ఇదిలా ఉంటే, ఈమెగారితో కోహ్లీ ప్రేమలో ఉన్నాడా? లేదా? అనేదే సందేహం. అటు ఈ విషయం కాస్తా అనుష్కకు తెలిస్తే ఎలా స్పందిస్తుందో తెలియాలి. ప్రస్తుతం హిందీలో 'పురానీ జాన్స్' అనే చిత్రంలో ఈ బ్రెజిలియన్ మోడల్ నటించింది.

  • Loading...

More Telugu News