: రిమోట్ తో నడిచే ప్రభుత్వం కావాలా? రైతులకు మేలుచేసే ప్రభుత్వం కావాలా?: మోడీ


సోదర సోదరుమణులారా... మీ అందరికీ నమస్కారాలు అంటూ మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నెల్లూరులో ఎన్డీయే ఆద్వర్యంలో జరుగుతోన్న బహిరంగసభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు మోడీ చెప్పారు. తాను ఇంతకు ముందే నెల్లూరు వచ్చానని, ఇప్పుడు మరోసారి ప్రచారంలో భాగంగా నెల్లూరుకు రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలని మోడీ చెప్పారు. ఎలాంటి ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. ఢిల్లీలో ఉన్న వారి చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్ తో నడిచే ప్రభుత్వం కావాలా? అని ఆయన ప్రశ్నించారు. తల్లీ కొడుకుల పాలన కావాలా?, రైతులకు మేలు చేసే ప్రభుత్వం కావాలా? ప్రజలే తేల్చుకోవాలని నరేంద్ర మోడీ చెప్పారు.

  • Loading...

More Telugu News