: పేలుళ్లలో మృతి చెందిన స్వాతికి టీసీఎస్ నివాళులు
ఈ ఉదయం చెన్నై రైల్వే స్టేషన్లో పేలుళ్లుకు బలైన గుంటూరు యువతి పరుచూరి స్వాతి (24)కి టీసీఎస్ చెన్నై కార్యాలయం నివాళులు అర్పించింది. 'మేము చాలా షాక్ కు గురయ్యాం. మా ఉద్యోగి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వారి కుంటుంబ సభ్యుల తరపున దేవుడిని ప్రార్థిస్తున్నాం' అంటూ టీసీఎస్ ఒక సంతాప ప్రకటన జారీ చేసింది. తమ హెచ్ ఆర్ ఉద్యోగి బాధితురాలి కుటుంబ సభ్యులను కలసి ఓదారుస్తారని ప్రకటించింది.