: నెల్లూరును మహానగరంగా తయారుచేస్తా: చంద్రబాబు
సీమాంధ్రను కాంగ్రెస్ కష్టాల్లోకి నెట్టివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ ది పరమ అసమర్థ నాయకత్వమని బాబు చెప్పారు. ఆయన నెల్లూరులో జరిగిన ఎన్డీయే బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. పవన్ కల్యాణ్ ప్రసంగంతో సీమాంధ్ర యువత పౌరుషం పెరిగిందని బాబు అన్నారు. పవన్ కల్యాణ్ స్ఫూర్తిని యువత తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
టీడీపీ అధికారంలోకి వస్తే నెల్లూరు నగరాన్ని మహా నగరంగా తయారుచేస్తానని చంద్రబాబు చెప్పారు. జిల్లాలో 1100 కి.మీ. మేర తీరప్రాంతం ఉన్నదని, నెల్లూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిపరుస్తామని ఆయన అన్నారు. ఐటీ హబ్ గా నెల్లూరును మారుస్తామని బాబు హామీ ఇచ్చారు. టీడీపీ-బీజేపీ కూటమి చారిత్రక అవసరమని ఆయన పునరుద్ఘాటించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.