: ఒకే కూటమి.. ఒకే నినాదం... ఒకే మంత్రం: పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ ఆవేశంగా మాట్లాడుతూ... దేశంలో ఒకే కూటమి విజయం సాధిస్తుందని, అదే ఎన్డీయే కూటమి అని అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలన్నీ ఒకే కూటమి అని చెప్పారు. దేశంలో ఒకే నినాదం అభివృద్ధి అని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే మంత్రం నరేంద్ర మోడీ అని పవన్ కల్యాణ్ అన్నారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన చేశారు.