: ప్రెగ్నెంటా... అయితే యోగా చేయండి!
గర్భం దాల్చిన వారికి యోగసనాలు చేసే మేలు గురించి శాస్త్రవేత్తలు కొన్ని వివరాలు వెల్లడించారు. ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్న గర్భిణులు యోగాతో దాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. వారానికోసారి ఎనిమిది వారాల పాటు యోగా తరగతులకు హాజరైన మహిళల్లో, ఇతరులతో పోల్చి చూసినప్పుడు ఒత్తిడి తగ్గినట్లు మాంచెస్టర్, న్యూకేస్టిల్ యూనివర్సిటీల శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.