: మొబైల్ కాల్ ధరలకు మళ్లీ రెక్కలు?
మొబైల్ పోన్ కాల్స్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంతో కాల్స్ ధరలను పెంచుకోవడం ద్వారా ఆదాయార్జనపై టెలికాం కంపెనీలు దృష్టి పెట్టాయి. కాల్ ధరలను సమీక్షించనున్నామని ఎయిర్ టెల్ ప్రకటించింది. ఉచిత ఆఫర్లకు కోత వేస్తున్నట్లు తెలిపింది. చార్జీలు పెంచకుండా నిలదొక్కుకోవడం కష్టమని భారతీ ఎయిర్ టెల్ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. వొడాఫోన్, ఐడియా కూడా ఇదే బాటలో నడవచ్చు. రిలయన్స్ కు చెందిన ఆర్ కామ్ ఇప్పటికే ధరలను సవరించింది.