: ఆళ్లగడ్డలో అమ్మ తరపున ప్రచారం చేస్తోన్న అఖిల ప్రియ
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దివంగత శోభానాగిరెడ్డి తరపున ఆమె పెద్ద కూతురు భూమా అఖిల ప్రియ ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికల్లో శోభానాగిరెడ్డికి ఓటు వేసి, అమ్మ ఆశయాలను నెరవేర్చాలని ఆమె ఓటర్లను కోరుతోంది. ‘అమ్మను పోగొట్టుకుని అందరం పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. ఎన్నికల్లో అమ్మను గెలిపించి, ఆమెకు నిజమైన నివాళి అర్పించాలని’ అఖిల ప్రియ చెబుతోంది. అందరినీ ఆప్యాయంగా పలుకరించే అమ్మ భౌతికంగా దూరమైనా, ఆమె మన మనస్సుల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుందని, ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపిస్తే, శోభానాగిరెడ్డి ఆశయాలను నెరవేరుస్తామంటూ ఆమె ప్రచారాన్ని కొనసాగిస్తోంది.