: రణబీర్-కత్రినాకైఫ్ బంధం సుస్పష్టం


నిప్పు లేనిదే పొగ రాదన్నది సామెత. అసలేమీ లేకుండా వదంతులు కూడా మొదలు కావు. బాలీవుడ్ లో ఇద్దరు టాప్ స్టార్లు రణబీర్ కపూర్, కత్రినాకైఫ్ ఎప్పటి నుంచో సన్నిహితంగా మెలుగుతూ, విదేశాల్లో హనీమూన్ లు కూడా చేసుకుంటున్నట్లు ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ మధ్య సన్నిహిత సంబంధం నిజమేనన్నట్లుగా.. ఈ జంట మరోసారి కెమెరాలకు చిక్కింది. ముంబైలోని బాంద్రాలో రణబీర్ ఒక ఇంటిని కొనుగోలు చేశారు. అది రెండేళ్ల నుంచి నిర్మాణంలో ఉంది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి పూర్తి కానుంది. దీన్ని చూసేందుకు గర్ల్ ఫ్రెండ్ కత్రినాతో కలసి రణబీర్ బుధవారం 'ఫర్ జెట్' వీధికి వెళ్లారు. త్వరలో వీరిద్దరూ కలసి అందులో అడుగుపెడతారేమో వేచి చూడాలి!

  • Loading...

More Telugu News