: పురంధేశ్వరిని గెలిపించాలని విజ్ఞప్తి చేసిన చంద్రబాబు!
ఎన్టీఆర్ కూతురైన దగ్గుబాటి పురంధేశ్వరి ఒకప్పుడు తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉండి... అటు నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి... మారిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటీవలే భారతీయ జనతాపార్టీలో చేరారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఎన్డీయే నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ తరపున పురంధేశ్వరి, ఎన్డీయే మిత్రపక్షమైన టీడీపీ తరపున ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈ సభకు హాజరయ్యారు. దీంతో, చాలా కాలం తర్వాత ఒకే బహిరంగ సభలో పురంధేశ్వరి, చంద్రబాబు కలిసి పాల్గొన్నారు. చంద్రబాబు తన ప్రసంగంలో పురంధేశ్వరిని గెలిపించాలని విజ్ఞప్తి చేయడం కొసమెరుపు.