: మోడీపై నేరం రుజువైతే రెండేళ్ల జైలు శిక్ష


ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించిన కేసులో మోడీ నేరం రుజువైతే ఆయనకు రెండళ్ల వరకూ జైలు శిక్ష పడవచ్చు. మోడీ నిన్న అహ్మదాబాద్ లోని రాణిప్ ప్రాంతంలో ఓటేసిన తర్వాత పోలింగ్ బూత్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలం చిహ్నాన్ని చేత్తో పట్టుకుని చూపించారు. దీనిపై ఈసీ ఆదేశాల మేరకు అహ్మదాబాద్ లోని క్రైం బ్రాంచ్ పోలీసులు మోడీపై కేసు నమోదు చేశారు. ఇది రుజువైతే మోడీకి జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. మోడీ సమావేశాన్ని ప్రసారం చేసిన టీవీ చానళ్లపై కూడా కేసు నమోదు చేయాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

  • Loading...

More Telugu News