: డ్రైవింగ్ టెస్టుల్లో మహిళలు వీకేనట..!


నేటి సమాజంలో పురుషులకు దీటుగా మహిళలు పలురంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగాలు, రాజకీయాలు, పరిశోధనలు, అంతరిక్ష యాత్రల్లాంటి పలు అంశాల్లో అతివలు తమదైన ముద్ర వేస్తున్నారు. అయితే, డ్రైవింగ్ టెస్టులు పాసవడంలో మాత్రం పురుషుల కంటే మహిళలే ఎక్కువగా విఫలమవుతుంటారట.

బ్రిటన్ లో నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైన విషయం ఇది. ఇక్కడి డ్రైవింగ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ చేపట్టిన అధ్యయనం పలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది. గతేడాది జరిగిన డ్రైవింగ్ టెస్టుల సందర్భంగా పురుషులు 6,46,000 పొరబాట్లు చేయగా, మహిళలు 8,57,000 పొరబాట్లు చేశారట. వాహనాలను రివర్స్ చేయడంలోనూ, గేర్లు మార్చడంలోనూ, స్టీరింగ్ తిప్పడంలోనూ మగువలు తడబడుతున్నారని సదరు అధ్యయనం స్పష్టం చేస్తోంది.

అదే సమయంలో పురుషులు వేగంగా వెళ్ళడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఉల్లంఘించడం, రహదారి నియమాలు పాటించకపోవడం వంటి విషయాల్లో విఫలమవుతున్నారట. కేవలం 36 గంటల శిక్షణతో పురుషులు డ్రైవింగ్ టెస్టుల్లో ఉత్తీర్ణులవుతుంటే, మహిళలకు మాత్రం 52 గంటల శిక్షణ అవసరమవుతోందని అధ్యయనం వెల్లడిస్తోంది. 

  • Loading...

More Telugu News