: ఉగ్రవాదుల లక్ష్యం చెన్నై కాకపోవచ్చు: తమిళనాడు డీజీపీ


తమిళనాడు డీజీపీ రామానుజమ్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఉదయం 7.10 గంటలకు చెన్నై రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గౌహతి ఎక్స్ ప్రెస్ లో బాంబు పేలుడు జరగగా, ఉగ్రవాదుల లక్ష్యం మాత్రం చెన్నై కాకపోవచ్చని రామానుజమ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. బెంగళూరు నుంచి గౌహతి వెళుతున్న ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా నడుస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు వేరొక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని, రైలు ఆలస్యంగా నడవడం వల్ల చెన్నైలో బాంబు పేలుళ్లు జరిగి ఉండవచ్చనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News