: శ్రీశాంత్ సంగీత దర్శకత్వం!


క్రికెటర్ గానే కాక డ్యాన్సర్ గా పేరున్న నిషేధిత ఆటగాడు శ్రీశాంత్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. తన అన్నయ్య తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న ఓ ద్విభాషా చిత్రానికి సంగీత స్వరాలు అందించేందుకు సిద్ధమయ్యాడు. అటు తన బావ మధు బాలకృష్ణన్ నిర్మిస్తున్న 'అంబుల్లా అజాగే' అనే సినిమాలో చిన్న పాత్ర కూడా పోషిస్తున్నాడట. ఇందులోనే ఓ పాట కూడా పాడుతున్నాడని తెలుస్తోంది. ఈ విషయాలపై శ్రీ అన్న దీపు సంతన్ స్పందిస్తూ, సస్పెన్స్, డ్రామాతో కూడిన తన సినిమాలోని అన్ని పాటలకు శ్రీశాంత్ సంగీతం సమకూరుస్తున్నాడని తెలిపారు. మరోవైపు నృత్య ప్రధానంగా ప్రసారమయ్యే 'ఝలక్ దిక్ లాజా' తాజా సీజన్ లో శ్రీ పాల్గొననున్నాడు.

  • Loading...

More Telugu News