: పినాకినీ ఎక్స్ ప్రెస్ లో బాంబు ఉన్నట్లు అనుమానం
విజయవాడ నుంచి చెన్నై వెళ్లాల్సిన పినాకినీ ఎక్స్ ప్రెస్ ను విజయవాడ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. డీ8 కోచ్ లోని 42వ నంబర్ బెర్త్ వద్ద అనుమానాస్పద సూట్ కేసు ఉన్నట్లు గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. సూట్ కేసును ప్లాట్ ఫామ్ పై ఉంచి, బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించారు.