: వాయులింగేశ్వరుడి సేవలో తరించిన మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోగా, అనంతరం ఆయన శ్రీకాళహస్తి చేరుకుని వాయులింగేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబికా దేవి సేవలో తరించారు. ముందుగా మోడీ రాహు కేతు, సర్ప దోష నివారణ పూజలను జరిపించుకున్నారు. ఆయనతో పాటు స్వామిని దర్శించుకున్న వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు, నటుడు పవన్ కల్యాణ్, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తదితరులు ఉన్నారు. వీరి రాకతో గంటపాటు భక్తులను దర్శనానికి అనుమతించలేదు. సమీపంలోని దుకాణాలను కూడా మూసివేయించారు.