: మోడీ రాకతో తిరుమలకు రెండు గంటలు బస్సులు బంద్
చెన్నైలో పేలుళ్లతో తిరుమల పర్యటనలో ఉన్న మోడీ భద్రత విషయంలో పోలీసులు అతిగా వ్యవహరించారు. ఆయన ఈ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు రాగా, రెండు గంటలపాటు కొండపైకి బస్సులు నిలిపివేశారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శ్రీకాళహస్తిలోనూ అదే పరిస్థితి నెలకొంది. మోడీ రానుండడంతో రాహు కేతు పూజలు నిలిపివేశారు. ఈ పూజల కోసం ఎక్కడి నుంచో వచ్చిన వారు ఆలయ అధికారుల తీరుతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మరోవైపు ఆలయ పరిసరాల్లో భద్రతను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.