: వైసీపీ హఠావో... సీమాంధ్ర బచావో: సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్
తెలంగాణలో 'కాంగ్రెస్ హఠావో... దేశ్ బచావో' అంటూ నినదించిన ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ఈ రోజు తిరుపతిలో కొత్త నినాదాన్నిచ్చారు.
'వైసీపీ హఠావో... సీమాంధ్ర బచావో' అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
తిరుపతిలో జరిగిన ఎన్డీయే బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ, వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల అవినీతి, అక్రమాలను ఏకిపారేశారు.
దేశం బాగుండాలంటే నరేంద్రమోడీ ప్రధాని అవ్వాలనీ, సీమాంధ్ర బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనీ ఆయన ప్రజలకు విశదీకరించి, ఈ రెండు పార్టీలను గెలిపించాలని కోరారు.
పనిలో పనిగా కెసీఆర్ ను కూడా ఆయన తూర్పారబట్టారు.
పవన్ ప్రసంగించినంత సేపు సభకు హాజరైన అశేష జనవాహిని క్లాప్స్ కొడుతూ, ఈలలు వేస్తూ తమ హర్షాతిరేకాన్ని వ్యక్తపరిచారు.