: రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయి: రాహుల్ గాంధీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అన్ని రాజకీయపార్టీలు లేఖలు ఇచ్చాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ దోషి కాదని అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్రకు పలు అవకాశాలు కల్పించామని ఆయన తెలిపారు. హైదరాబాదులో సీమాంధ్రులకు మరో పదేళ్ల వరకు విద్యావకాశాలు కల్పించామని ఆయన చెప్పారు.
అలాగే ఆంధ్రాయూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీ చేస్తామని ఆయన వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి, విశాఖపట్టణం దాహార్తి తీరుస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. విశాఖపట్టణం చుట్టుప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసి పలు అవకాశాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.