: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పర్వానికి తెర పడింది. అయితే 6 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్న వారికి మాత్రం, ఎంత సమయమైనా ఓటు వేసే అవకాశం ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 68 శాతం పోలింగ్ నమోదయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఇందులో అత్యల్పంగా హైదరాబాదులో 53 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.
తెలంగాణ మొత్తం మీద చూసుకుంటే... చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల వివిధ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ పై పోలీసు కేసు నమోదైంది.