: తిరుపతిలో నేడు మోడీ, బాబు, పవన్ ల సభ
తెలంగాణలో ఈ రోజు ఎన్నికలు అయిపోతుండటంతో... సీమాంధ్రపై దృష్టి పెట్టాయి రాజకీయ పార్టీలు. ఈ నేపథ్యంలో, ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరుపతిలో జరిగే ఎన్డీఏ ఎన్నికల శంఖారావం సభకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లు హాజరవుతున్నారు. ఈ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.